News February 23, 2025

నారాయణపేటలో నేడు గురుకుల ప్రవేశ పరీక్ష

image

జిల్లాలో నేడు గురుకుల ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష రాయడానికి హాజరయ్యే విద్యార్థులు పరీక్ష సెంటర్లకు ఉదయం 9 గంటల లోపు చేరుకోవాలని జిల్లా అధికారులు తెలిపారు. విద్యార్థుల తమ వెంట హాల్ టికెట్, పరీక్ష ప్యాడ్, బ్లూ లేదా బ్లాక్ పెన్నులను తీసుకురావాలన్నారు. హాల్ టికెట్లలో ఏమైనా తప్పిదాలు ఉన్నట్లయితే విద్యార్థులు చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకురావాలని ఓ ప్రకటనలో తెలిపారు.

Similar News

News March 23, 2025

NRPT: పాముకాటుతో మహిళ మృతి

image

మరికల్ మండలంలో పాముకాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన ఘటన నిన్న జరిగింది. గ్రామస్థుల వివరాలు.. గాజులయ్యతండాకు చెందిన లక్ష్మి కట్టెల కోసం పొలానికి వెళ్లింది. కట్టెలు కొడుతుండగా పాము కాటేసింది. దాన్ని ఆమె పట్టించుకోకపోవటంతో నురుగులు కక్కి అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు.

News March 23, 2025

MBNR: భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

image

నూతనంగా నిర్మిస్తున్న భవనంపై నుంచ పడి వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. గాజులపేటకు చెందిన రమేశ్(42) పీయూ ఆవరణలో నిర్మిస్తున్న భవనంలో పనులు చేస్తుండగా జారి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని జనరల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం HYDకి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదైంది.

News March 23, 2025

ఆకట్టుకున్న అద్భుత నృత్యప్రదర్శనలు

image

ప్రఖ్యాత నాట్యకళాసంస్థ అభినయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రాత్రి రవీంద్రభారతిలో నాట్యప్రవాహ శీర్షికన అభినేత్రి గురు ప్రమోద్ కుమార్ రెడ్డి, భారత రంగస్థల ఆకాడమీ గురు కోకా విజయలక్ష్మి, నృత్యాలయం గురు ఎన్.లక్ష్మి, రందుల కూచిపూడి నాట్యనిలయం గురు జి.రవిల 80మంది శిష్యులు వివిధ అంశాల అద్భుత నృత్యప్రదర్శనలతో ఆశేష కళాప్రియులను ఆకట్టుకున్నారు.

error: Content is protected !!