News April 2, 2025

నారాయణపేటలో నేషనల్ EMT DAY వేడుకలు

image

108లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నందుకుగాను ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్ రెండో తేదీన నేషనల్ EMT DAY వేడుకలు ఘనంగా నిర్వహిస్తోందని MBNR జిల్లా ప్రోగ్రాం అధికారి రవికుమార్, NRPT జిల్లా సూపర్‌వైజర్ రాఘవేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 18, 2025

అనకాపల్లి జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాను డ్రగ్స్, క్రైమ్ రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ విజయకృష్ణన్ విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో పేర్కొన్న అంశాలను వివరించారు. హాట్ స్పాట్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ఆకతాయిల బెడద లేకుండా చూడాలన్నారు. జాతీయ రహదారులకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు.

News September 18, 2025

నిర్మల్: అందుబాటులో రాండమ్ డోనర్ ప్లేట్లెట్లు

image

నిర్మల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో రాండమ్ డోనర్ ప్లేట్లెట్లు (RDP) అందుబాటులో ఉన్నాయని సిబ్బంది తెలిపారు. RDPలు డెంగ్యూ, జ్వర బాధితులకు, కీమోథెరపీ చికిత్స పొందుతున్న రోగులకు, తక్కువ ప్లేట్లెట్లు ఉన్న పరిస్థితుల్లో అవసరమైన రోగులకు ఉచితంగా అందజేస్తామన్నారు. సమాచారం కోసం నిర్మల్ GGH బ్లడ్ బ్యాంక్‌ను సంప్రదించాలని కోరారు.

News September 18, 2025

నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

image

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష‌హోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.