News February 21, 2025

నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి

image

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేటకు చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటిసారి మహిళల నిర్వహణలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డితో కలిసి ప్రారంభించారు.

Similar News

News November 13, 2025

వరల్డ్ లాంగెస్ట్ మ్యారీడ్ కపుల్ వీరే..

image

అత్యధిక కాలంగా దాంపత్య జీవితం సాగిస్తున్న జంటగా అమెరికాకు చెందిన ఎలీనర్(107), లైల్ గిట్టెన్స్(108) ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 1942లో వీరికి వివాహం కాగా 83ఏళ్లుగా అన్యోన్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే ఓల్డెస్ట్ లివింగ్ కపుల్‌గానూ ఖ్యాతి గడించారు. వీరి కంటే ముందు బ్రెజిల్‌ జంట మనోయల్, మరియా అత్యధిక కాలం(85ఏళ్లు) వైవాహిక జీవితం గడిపిన కపుల్‌గా రికార్డుల్లోకెక్కారు.

News November 13, 2025

భువనగిరి: గంగలోనే శివుడి దర్శనం ఇక్కడి ప్రత్యేకత

image

రాచకొండ ప్రాంతంలోని ఆరుట్లలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక జాతర కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభమైంది. మరో కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో 15 రోజుల పాటు జాతర కొనసాగనుంది. బుగ్గ జాతరలో కార్తీక స్నానం చేస్తే కాశీస్నాన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. నారాయణపూర్, చౌటుప్పల్, మునుగోడు మండలాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక్కడ గంగలోనే శివుడు దర్శనమివ్వడం ప్రత్యేకత.

News November 13, 2025

రాజన్న సిరిసిల్ల: ‘మత్తు వదిలిస్తున్నారు’..!

image

రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ పగడ్బందీ చర్యలు చేపడుతోంది. దీంతో మందుబాబులు తాగి బండ్లు నడపాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఎక్కువ ప్రమాదాలు మద్యం తాగి వాహనాలు నడిపే సమయాల్లోనే జరుగుతుండడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌తో అలాంటి వాళ్లకు జిల్లా పోలీసులు చెక్ పెడుతున్నారు. జిల్లాలో గత 11నెలల్లో దాదాపు 11వేల కేసులు నమోదు కాగా, రూ.90 లక్షలకుపైగా జరిమానాలు విధించారు. 230మందికి జైలుశిక్షలు పడేలా చేశారు.