News March 15, 2025
నారాయణపేట్: ఒంటిపూట బడులు.. ఒక్కో క్లాస్ ఎంతసేపంటే..?

నేటి నుంచి ఒంటిపూట బడుల నేపథ్యంలో ఒక్క క్లాస్ పీరియడ్ ఎంత సమయం ఉంటుందనే వివరాలను ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గం.లకు 1వ బెల్, 8:05కు 2వ బెల్, 8:15- 8:55 వరకు 1వ పీరియడ్, 8:55- 9:35 వరకు 2వ పీరియడ్, 9:35- 10:15 వరకు 3వ పీరియడ్, 10:15- 10:30 గంటలకు బ్రేక్. 10:30 గం. నుంచి 11:10 వరకు 4వ పీరియడ్, 11:10 గం. నుంచి 11:50 వరకు 5వ పీరియడ్, 11:50 గం. నుంచి 12:30 వరకు చివరి పీరియడ్. SHARE IT
Similar News
News November 17, 2025
VZM: ఒకే వేదికపై రాజకీయ దిగ్గజాలు

విజయనగరం జిల్లా రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికను పంచుకున్నారు. జిల్లా కేంద్రంలో తూర్పుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజన మహోత్సవం జరిగింది. వనభోజనాలకి వైసీపీ, టీడీపీ, జనసేన ముఖ్య నాయకులు హాజరై ఒకే వేదికపై ఆశీనులయ్యారు. మంత్రి శ్రీనివాస్, చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు, జనసేన నేత పడాల అరుణ, వైసీపీ నేతలు చిన్నశ్రీను, బొత్స ఝాన్సీ, తదితర నేతలు ఒకే వేదికపై కనిపించారు.
News November 17, 2025
బుడితి: ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుంది.. గర్భిణుల మృతితో అలజడి

అది ఒక ప్రభుత్వ ఆసుపత్రి.. ఇటీవల కాలంలో ఆ హాస్పిటల్లో గర్భిణులు శస్త్ర చికిత్స అనంతరం మృతి చెందడం కొనసాగుతుంది. దీనిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సారవకోట మండలం బుడితి సీహెచ్సీలో గతంలో ఒకేరోజు ఇద్దరు గర్భిణులు మృతి చెందారు. తాజాగా శనివారం మరో గర్భిణి మృతి చెందింది. దీనిపై అధికారులు సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు.
News November 17, 2025
కడప: కరెంట్ సమస్యలు ఉన్నాయా?

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD నిర్వహిస్తున్నట్లు APSPDCL ఛైర్మన్&ఎండీ శివశంకర్ తెలిపారు. రాయలసీమ జిల్లాల ప్రజలకు కరెంట్ సమస్యలు ఉంటే సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 89777 16661కు కాల్ చేయాలని సూచించారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నంబర్ 91333 31912 ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.


