News March 15, 2025
నారాయణపేట్: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్23 వరకు ఈ హాఫ్డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్24 నుంచి జూన్11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ-ఓపెన్.
Similar News
News November 28, 2025
HYD: రాత్రికి రాత్రే ఊరు మారిపోదు బ్రో..

మా ఊరు గ్రేటర్లో విలీనమైంది. ఇక అభివృద్ధి పరుగులు పెడుతుందని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ‘అనేక గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు విలీనం అవుతున్నా, ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాతే అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. రాత్రికి రాత్రే ఊరు దశ.. దిశ మారిపోదు. పస్తుతం ఉన్న మహానగరంలోనే సమస్యలున్నాయి. విలీనం తర్వాత కూడా ఉంటాయి’ అని శివారులో గుసగుసలు వినిపిస్తున్నాయి.
News November 28, 2025
ప్రచార రథం వద్ద ఏర్పాట్లు పరిశీలించిన ఆలయ ఈవో

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం తూర్పు భాగంలో ఏర్పాటుచేసిన స్వామి వారి ప్రచార రథం వద్ద ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి పరిశీలించారు. భక్తులు ప్రచార రథంలో ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని, ఎల్ఈడి స్క్రీన్ పై ప్రధాన ఆలయంలో అర్చకులు జరుపుతున్న పూజలను తిలకిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ఈవో రమాదేవి భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
News November 28, 2025
128 మంది మృతి.. కారణమిదే!

హాంగ్కాంగ్లోని అపార్ట్మెంటలో ఘోర <<18395020>>అగ్నిప్రమాదం<<>> పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 128 మంది మరణించగా 79 మంది గాయపడ్డారు. వందల ఫైర్ ఇంజిన్లు, 2,300 మంది ఫైర్ ఫైటర్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఆయా అపార్ట్మెంట్లలో ఫైర్ అలారాలు పనిచేయకపోవడంతో నివాసితులు మంటలను గుర్తించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. 128మంది సజీవదహనానికి ఇదే కారణమని భావిస్తున్నారు.


