News March 19, 2025
నారాయణపేట: ఆ విద్యార్థులకు FREEగా శిక్షణ

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం భవిత సెంటర్లలో ప్రత్యేక శిక్షణను ఫ్రీగా ఇస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. నారాయణపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో బుధవారం భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలను పంపిణీ చేశారు. భవిత సెంటర్‌లో దివ్యాంగులకు ఇచ్చే శిక్షణను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 23, 2025
మహిళల ఆర్థిక స్వాలంబనే లక్ష్యం: సీతక్క

మహిళల ఆర్థిక స్వాలంబన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ సీతక్క ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
News April 23, 2025
ఎంపీ కార్యాలయం పేరు మారిస్తే బాగుండు: కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయానికి ఎన్టీఆర్ భవన్ పేరు మార్చి చార్లెస్ శోభరాజ్ భవన్ పేరు పెడితే బాగుంటుందని మాజీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో పేర్కొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన ఎంపీ కేశినేని చిన్ని చేసే పనులు ఇసుక వ్యాపారం, ప్లై యాష్ తోలకం, భూ దందాలు, బ్రోకరేజ్‌లు, పేకాట, రేషన్ బియ్యం మాఫియా చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎంపీ కార్యాలయంలో చేస్తున్నారని మండిపడ్డారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాలు.. ఒక్క మార్క్ మాత్రమే వచ్చింది!

ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ స్టూడెంట్‌కు షాకింగ్ ఫలితాలు వచ్చాయి. 600 మార్కులకు గాను ఒక్క మార్క్ మాత్రమే వచ్చింది. సైన్స్‌లో ఒక్క మార్కు రాగా, మిగతా 5 సబ్జెక్టుల్లో సున్నా మార్కులు వచ్చాయి. దీంతో ఫలితాలు ఇలా రావడం ఫస్ట్ టైమ్ అనే చర్చ జరుగుతోంది.
*ప్రైవసీ దృష్ట్యా సదరు విద్యార్థి వివరాలను ఇక్కడ ఇవ్వట్లేదు.