News February 21, 2025

నారాయణపేట: ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం: సీఎం

image

మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల, నర్సింగ్ కాలేజ్‌ను ప్రారంభించుకోవడం ఆనందదాయకమని CM రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలో ఆయన పర్యటనలో భాగంగా మెడికల్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. గతంలో కేంద్రం తిరస్కరించినా తమ మంత్రి, అధికారులు తీవ్రంగా ప్రయత్నించి ఎనిమిది మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

Similar News

News October 19, 2025

ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలి: GWMC మేయర్

image

వరంగల్ నగరంలో బాణాసంచా విక్రయదారులు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బాణాసంచా దుకాణదారులు పాటించాల్సిన విధి విధానాలు, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలపై బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించడానికి తగిన సూచనలు చేశారు. పండుగ వేళ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రజల భద్రతే తమ మొదటి కర్తవ్యం అని పేర్కొన్నారు.

News October 19, 2025

అక్టోబర్ 19: చరిత్రలో ఈ రోజు

image

1952: ప్రత్యేకాంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభం
1917: గణిత శాస్త్రవేత్త ఎస్ఎస్ శ్రీఖండే జననం
1955: నిర్మాత, దర్శకుడు గుణ్ణం గంగరాజు జననం
1987: భారత టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని జననం
1986: ఏపీ మాజీ సీఎం టంగుటూరి అంజయ్య మరణం
2006: నటి, గాయని శ్రీవిద్య మరణం
2015: హాస్యనటుడు కళ్లు చిదంబరం మరణం

News October 19, 2025

ఈ దీపావళిని ఇలా జరుపుకుందాం!

image

దీపావళి అంటే చీకటిని తరిమేసి, ఇళ్లలో దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్నవారి జీవితాల్లోనూ వెలుగులు నింపే బాధ్యతను తీసుకొని వారింట్లోనూ పండుగ జరిగేలా చర్యలు తీసుకుందాం. ఇంట్లోని బట్టలు, వస్తువులు, లేదా ఆర్థిక సాయం చేసి పేదలకు అండగా నిలుద్దాం. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారానే పండుగకు నిజమైన అర్థం వస్తుంది. ఏమంటారు?