News February 21, 2025
నారాయణపేట: ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం: సీఎం

మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల, నర్సింగ్ కాలేజ్‌ను ప్రారంభించుకోవడం ఆనందదాయకమని CM రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలో ఆయన పర్యటనలో భాగంగా మెడికల్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. గతంలో కేంద్రం తిరస్కరించినా తమ మంత్రి, అధికారులు తీవ్రంగా ప్రయత్నించి ఎనిమిది మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
Similar News
News March 17, 2025
వికారాబాద్‌లో NCCని ఏర్పాటు చేయండి: ఎంపీ

వికారాబాద్‌లో NCC యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్‌కు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతమైన తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులకు NCC యూనిట్‌ను వికారాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుందన్నారు.
News March 17, 2025
BREAKING: ఫలితాలు విడుదల

తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు ప్రొవిజన్ సెలక్షన్ లిస్టును TGPSC విడుదల చేసింది. 574 మంది పోస్టులకు ఎంపికైనట్లు వివరించింది. 581 పోస్టులకు TGPSC పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. లక్షా 45 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు.
News March 17, 2025
REWIND: 1967వ నాటి ఆమదాలవలస రైల్వే స్టేషన్

ఆమదాలవలస పట్టణంలో శ్రీకాకుళం రోడ్డు పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ జిల్లాలోని అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా ఉంది. అలాంటి రైల్వే స్టేషన్ 1967వ సంవత్సరంలో ఎలా ఉండేదో తెలిపే పాత ఫొటో వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్ అకౌంట్‌లలో ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. అప్పటిలో ఆమదాలవలస పట్టణాన్ని ఆముదం పట్టణంగా పిలిచేవారని, అశోకుడి కాలంలో హేరందపల్లిగా పిలుచుకునే వారిని ప్రస్తుతం ఈ ఫొటో ద్వారా చర్చనీయాంశంగా మారింది.