News April 14, 2025
నారాయణపేట: ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారం అందించాలి: శ్రీనివాస్ గౌడ్

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గోర్లోనిబావి గ్రామంలో లో వోల్టేజ్ కరెంటుతో ఎండిపోయిన వరి పొలాలను మహబూబ్నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్యెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తక్షణమే ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారంగా అందించాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 17, 2025
టెరిటోరియల్ ఆర్మీలోకి మహిళలు!

టెరిటోరియల్ ఆర్మీలోకి మహిళలను చేర్చుకునే అంశాన్ని ఆర్మీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని బెటాలియన్లలో నియామకాలు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక ఫలితాలను విశ్లేషించిన తర్వాత ఇతర బెటాలియన్లలోనూ నియమించుకునే అవకాశం ఉంది. ఆర్మ్డ్ ఫోర్సెస్లో నారీ శక్తి పెరగాలన్న ప్రభుత్వ ప్రయత్నాల నేపథ్యంలో ఈ దిశగా అడుగులు పడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
News November 17, 2025
నేడు నక్తం పాటిస్తున్నారా?

ఈ పవిత్ర కార్తీక మాసంలో చివరి సోమవారానికి చాలా విశిష్టత ఉంది. గత సోమావారాల్లో ఆచరించని విధులను నేడు ఆచరిస్తే అంతకన్నా ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్మకం. శివ భక్తులు ముఖ్యంగా నేడు ‘నక్తం’ దీక్షను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా సకల శుభాలు కలుగుతాయని అంటున్నారు. నక్తం అంటే.. పగలు ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేయడం. ఈ దీక్షతో శివానుగ్రహంతో అఖండ పుణ్యం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం.
News November 17, 2025
నేడు నితీశ్ రాజీనామా.. 20న ప్రమాణం?

బిహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా CM నితీశ్ కుమార్ ఇవాళ రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈనెల 20న ఆయన తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మొత్తం 32 మందితో కొత్త క్యాబినెట్ కొలువుదీరనుందని, బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని సమాచారం. స్పీకర్గా బీజేపీ సభ్యుడినే నియమిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉందని చెప్పాయి.


