News April 14, 2025

నారాయణపేట: ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారం అందించాలి: శ్రీనివాస్ గౌడ్

image

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గోర్లోనిబావి గ్రామంలో లో వోల్టేజ్ కరెంటుతో ఎండిపోయిన వరి పొలాలను మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్యెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తక్షణమే ఎకరానికి రూ.40 వేలు నష్టపరిహారంగా అందించాలని డిమాండ్ చేశారు.

Similar News

News April 25, 2025

MHBD: ఉగ్రదాడిలో చనిపోయిన మృతులకు నివాళులర్పించిన కలెక్టర్

image

మహబూబాబాద్ మండల కేంద్రంలోని ఏటిగడ్డతండ, రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్‌లు పాల్గొన్నారు. ముందుగా జమ్మూ కాశ్మిర్ పహేల్గాంలో ఉగ్రదాడిలో చనిపోయిన మృతులకు నివాళులర్పించి రెండు నిమిషాల మౌనం పాటించారు. అదనపు కలెక్టర్లు కె.వీరబ్రహ్మంచారి, ఆర్‌డీవో కృష్ణవేణి, తదితరులు ఉన్నారు.

News April 25, 2025

విశాఖలో చంద్రమోలి అంతిమ యాత్ర

image

పహల్గాంలో ఉగ్రమూకల కాల్పుల్లో మరణించిన చంద్రమోలి అంతిమ యాత్ర విశాఖలో ప్రారంభమైంది. పాండురంగాపురంలో ఆయన పార్థివదేహానికి మంత్రులు అనిత, సత్యకుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నివాళులు అర్పించి పాడె మోశారు. జ్ఞానాపురం శ్శశాన వాటికలో ఆయన దహన సంస్కణలు పూర్త చేయనున్నారు.

News April 25, 2025

ఉగ్రదాడి వెనుక సూత్రధారి ఇతడే?

image

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర శిబిరం నుంచి విదేశీ ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి వచ్చారని, వీరికి స్థానిక మిలిటెంట్లు సాయంగా నిలిచారని పేర్కొన్నాయి. ఆ ఉగ్ర మాడ్యూల్‌కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ నుంచి వారు దాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!