News February 5, 2025

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలకు భూ సర్వే.!

image

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా ఊట్కూరు మండలంలోని తిప్రస్ పల్లి-బాపూర్ గ్రామాల మధ్య పంప్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం రెవెన్యూ సిబ్బంది, ప్రాజెక్టు సర్వేయర్‌లు భూ సర్వేను చేపట్టారు. ఏ సర్వే నంబర్లు ఎంత భూమి పోతుందన్న పూర్తి వివరాలు రైతులకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చింత రవి, RI వెంకటేష్, సర్వేయర్ కృష్ణయ్య, ఎస్ఐ కృష్ణం రాజు పాల్గొన్నారు.

Similar News

News November 25, 2025

సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడానికి సాంకేతికతను మరింత అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలకు ముడిపడి ఉన్నటు సాంకేతికత సమస్యలను అధిగమించడానికి సెల్ టవర్‌లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సెల్ టవర్ నిర్మాణాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News November 25, 2025

NGKL: వడ్డీ లేని రుణాల పంపిణీకి డిప్యూటీ సీఎం ఆదేశాలు

image

రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ లేని రుణాల పంపిణీని ఒకేసారి నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కలసి కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొని వివరాలు తెలుసుకున్నారు.