News February 5, 2025
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలకు భూ సర్వే.!

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా ఊట్కూరు మండలంలోని తిప్రస్ పల్లి-బాపూర్ గ్రామాల మధ్య పంప్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం రెవెన్యూ సిబ్బంది, ప్రాజెక్టు సర్వేయర్లు భూ సర్వేను చేపట్టారు. ఏ సర్వే నంబర్లు ఎంత భూమి పోతుందన్న పూర్తి వివరాలు రైతులకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చింత రవి, RI వెంకటేష్, సర్వేయర్ కృష్ణయ్య, ఎస్ఐ కృష్ణం రాజు పాల్గొన్నారు.
Similar News
News February 19, 2025
సలామ్ DIIs: 45 రోజుల్లోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడి

స్వదేశీ సంస్థాగత మదుపరులు (DII) భారత స్టాక్ మార్కెట్లకు ఆపద్బాంధవులుగా మారారు. FM నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగానే రిటైల్ ఇన్వెస్టర్లతో కలిసి FIIల పెట్టుబడుల ఉపసంహరణను పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటున్నారు. 2025లో 45 రోజుల్లోనే రూ.1.2లక్షల కోట్లను ఈక్విటీల్లో కుమ్మరించారు. FIIలు వెనక్కి తీసుకున్న రూ.1.6 లక్షల కోట్లతో ఇది దాదాపుగా సమానం. 2024లోనూ DIIలు రూ.5.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం విశేషం.
News February 19, 2025
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. ముఖ్యమైన అంశాలు!

● శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
● అన్ని ఆర్జిత సేవలు రద్దు.. ప్రముఖులకు 4విడతలుగా బ్రేక్ దర్శనం
● 22న టీటీడీ తరఫున స్వామి, అమ్మవార్లకు వస్త్రాల అందజేత
● 23న సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ
● కాలినడక భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి
● శివరాత్రి రోజున ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం
● భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం
● ఘాట్‌లో 24గంటల అనుమతి
● 453 స్పెషల్ బస్సులు ఏర్పాటు
News February 19, 2025
BREAKING: భద్రాచలంలో చైన్‌స్నాచింగ్

భద్రాచలం పట్టణంలోని ఇందిరా మార్కెట్ రోడ్డులో గల కిరాణా దుకాణంలో బుధవారం వాటర్ బాటిల్ కొనడానికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు షాప్ యజమానురాలి మెడలో నుంచి సుమారు 7 తులాల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు. వెంటనే బాధితులు 100కు డయల్ తెలియజేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.