News February 27, 2026

నారాయణపేట జిల్లాలో పోలీస్ దర్బార్ నిర్వహించిన ఎస్పీ

image

నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీస్ దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ పోలీసులు, హోమ్ గార్డులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హెడ్ క్వార్టర్స్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, వారాంతపు సెలవులు, పెండింగ్‌లో ఉన్న బిల్లుల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రియాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 14, 2026

ఇంజెక్షన్ల రీయూజ్.. పాక్‌లో 331 మంది చిన్నారులకు HIV!

image

పాకిస్థాన్‌లోని టౌన్సాలో THQ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చిన్నారులను బలితీసుకుంటోంది. ఇంజెక్షన్ల కోసం వాడిన సిరెంజ్‌లనే మళ్లీ ఉపయోగించడంతో
331 మంది చిన్నారులు HIV బారిన పడినట్లు బీబీసీ దర్యాప్తులో తేలింది. 2024 నవంబరు నుంచి 2025 అక్టోబరు మధ్య ఈ కేసులు నమోదయ్యాయి. కాగా వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం ఖండిస్తోంది.

News April 14, 2026

సీఎం పదవికి నితీశ్ రాజీనామా

image

ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను గవర్నర్‌కు అందజేశారు. మరికాసేపట్లో బీజేపీ కొత్త సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించనుంది. బిహార్‌కు నితీశ్ 21 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ రాష్ట్రంలో 243 అసెంబ్లీ సీట్లు ఉండగా NDAకు 202 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

News April 14, 2026

వికారాబాద్: రూ.500కే 50 కిలోల బస్తా..!

image

ఉల్లి రైతులకు జిల్లాలో కన్నీళ్లే మిగులుతున్నాయి. పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేదేంలేక VKB పట్టణంలోని ప్రధాన రోడ్లపైకి ట్రాక్టర్లతో ఉల్లిని తెచ్చి విక్రయిస్తున్నారు. 50కిలోల బస్తాను రూ.500కే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు.