News February 27, 2026
నారాయణపేట జిల్లాలో పోలీస్ దర్బార్ నిర్వహించిన ఎస్పీ

నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీస్ దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ పోలీసులు, హోమ్ గార్డులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హెడ్ క్వార్టర్స్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, వారాంతపు సెలవులు, పెండింగ్‌లో ఉన్న బిల్లుల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రియాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 12, 2026
రేపు ప్రజా సమస్య పరిష్కార వేదిక: కలెక్టర్

పుట్టపర్తితో పాటు మండల, డివిజన్, మునిసిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తులను కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov.inలో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 12, 2026
తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

తిరుపతి కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే సోమవారం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అర్జీలు తీసుకుంటామని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీదారులు తమ వివరాలు, పాత స్లిప్పులు తీసుకు రావాలని సూచించారు. 1100కు కాల్ చేసి ఫిర్యాదుల స్టేటస్ తెలుసుకోవచ్చని చెప్పారు. Meekosam.ap.gov.in ద్వారానూ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
News April 12, 2026
నెల్లూరు: సుధాకర్ చనిపోయినా..!

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఉమ్మాయపల్లికి చెందిన సుధాకర్ యాదవ్ ఈనెల 10వ తేదీ బైక్ మీద వెళ్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. సుధాకర్ చనిపోయినా.. ఆయన అవయవదానంతో మరికొందరు బతకాలని కుటుంబ సభ్యులు ఆశించారు. దీంతో ఆయన అవయవాలను వేరే వాళ్లకు అమర్చడానికి తిరుపతికి తరలిస్తున్నారు.


