News March 6, 2025
నారాయణపేట జిల్లాలో బయటికెళ్లాలంటే భయంభయం!

నారాయణపేట జిల్లాలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. నిప్పులు కక్కుతున్న ఎండలతో ‘భానుపురి’ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మధ్యాహ్నం వేళ మరింత భగభగమండిపోతున్నాడు. దాంతో ఇటు వేడి.. అటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. బుధవారం జిల్లాలో 37 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి పానీయాలు సేవిస్తున్నారు.
Similar News
News November 22, 2025
నల్గొండ జిల్లాలో కొండెక్కిన కోడిగుడ్ల ధరలు

ఒకవైపు కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. మరోవైపు కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జనజీవనం చాలా ఖరీదైపోతుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కోడి గుడ్డు ధర రూ.8కి చేరడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. గుడ్ల ధరలు కొండెక్కినా కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.220లకు తగ్గడం విశేషం.
News November 22, 2025
ASF: అక్రమాలను కట్టడి చేసిన SP కాంతిలాల్ పాటిల్

ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పీగా నితికా పంత్ నియమితులయ్యారు. గతంలో విధులు నిర్వహించిన ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గవర్నర్ ఏడీసీగా బదిలీ అయ్యారు. ఎస్పీ కాంతిలాల్ తన 5 నెలల పదవి కాలంలో అక్రమ ఇసుక, మట్కా, జూదం, నకిలీ విత్తనాలు, పీడీఎస్ బియ్యం తదితర అక్రమ వ్యాపారాలను కట్టడి చేయడంలో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 72 కేసులు నమోదు చేసి 122 మందిని అరెస్టు చేశారు.
News November 22, 2025
మాక్ అసెంబ్లీ వివాదం: వైష్ణవికి మంత్రి లోకేశ్ అభయం

నంబులపూలకుంట ZPHS విద్యార్థిని వైష్ణవి కదిరి నియోజకవర్గం నుంచి మాక్ అసెంబ్లీ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. అయితే, రెండో స్థానంలో ఉన్న గూటిబైలు విద్యార్థి లిఖిత్ రెడ్డిని మాక్ అసెంబ్లీకి ఎంపిక చేయడంతో వైష్ణవి తల్లిదండ్రులు ట్విటర్ వేదికగా మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి ‘డోంట్ వర్రీ వైష్ణవి. నువ్వు మాక్ అసెంబ్లీలో పాల్గొంటావు. నీకు మాట ఇస్తున్నా’ అని రిప్లై ఇచ్చారు.


