News February 2, 2025

నారాయణపేట జిల్లాలో భారీ మొసలి కలకలం

image

నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఉదయం మొసలి కలకలం రేపింది. గ్రామ రైతు పొలంలో వెళ్తుండగా ఒడ్డున మొసలి కనిపించిందని తెలిపారు. పొలం మధ్యలో మొసలి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందించారు. అటువైపు వెళ్లవద్దని, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Similar News

News October 17, 2025

కడప: బిడ్డకు జన్మనిచ్చిన 16 ఏళ్ల బాలిక

image

ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు మండలంలో వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన చెంచయ్యగారి ప్రసాద్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే ఊరికి చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. చంపుతానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలికకు గర్భం రావడంతో అబార్షన్ చేయించాలని ప్రయత్నించాడు. ఈక్రమంలో జులైలో నిందితుడిపై పోక్సో కేసు కింద నమోదు చేశారు. ఆ బాలిక ఇవాళ తెల్లవారుజామున బిడ్డకు జన్మనిచ్చింది.

News October 17, 2025

HYD: ఏపీ మహిళపై అత్యాచారం చేసింది ఇతడే

image

రైలులో ప్రయాణికురాలిపై <<18009296>>అత్యాచారం<<>> కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని గుంటూరు రైల్వే పోలీసులు తెనాలిలో అదుపులోకి తీసుకన్నారు. పల్నాడులోని సత్తెనపల్లి పరిధి లక్కరాజుగార్లపాడుకు చెందిన జోన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. 2 నెలల క్రితం కేరళకు చెందిన మహిళపైనా అతడు అత్యాచారం చేసినట్లు వెల్లడైంది. మంగళవారం సికింద్రాబాద్ వస్తున్న సంత్రగాచి ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

News October 17, 2025

దీపావళి బోనస్.. నేడే అకౌంట్లలో రూ.లక్ష జమ

image

తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఇవాళ దీపావళి బోనస్ అందనుంది. పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు(PLR) కింద బొగ్గు సంస్థలు ఒక్కో కార్మికుడికి రూ.1.03 లక్షల చొప్పున అకౌంట్లలో జమ చేయనున్నాయి. ఇప్పటికే ఈనెలలో దసరా సందర్భంగా రూ.1.95 లక్షల చొప్పున కార్మికులకు ప్రభుత్వం కానుక ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ దీపావళి బోనస్ రానుండటంతో వారి ఆనందం రెట్టింపు కానుంది.