News February 2, 2025
నారాయణపేట జిల్లాలో భారీ మొసలి కలకలం

నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఉదయం మొసలి కలకలం రేపింది. గ్రామ రైతు పొలంలో వెళ్తుండగా ఒడ్డున మొసలి కనిపించిందని తెలిపారు. పొలం మధ్యలో మొసలి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందించారు. అటువైపు వెళ్లవద్దని, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Similar News
News November 27, 2025
MPల సమావేశంలో పెద్దపల్లి MPవంశీ కృష్ణ

HYD తెలంగాణ ప్రజా భవన్లో రాష్ట్ర MPల సమావేశంలో పెద్దపల్లి MPగడ్డం వంశీ కృష్ణ పాల్గొని పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రానికి ఆర్థిక మద్దతు, సాగు- తాగునీరు ప్రాజెక్టులు, ఎనర్జీ సెక్యూరిటీ, జాతీయ మౌలిక వసతులు, ఉపాధి, ప్రజా ఆరోగ్యం, విద్య- సామాజిక న్యాయంపై చర్చించారు. ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు, రాష్ట్ర హక్కులపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రస్తావించారు.
News November 27, 2025
నల్గొండ జిల్లాలో నేటి సమాచారం..

నల్గొండ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
దేవరకొండ: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు
చండూరు: వృథాగా కృష్ణా జలాలు
నల్గొండ: రేపటితో ముగిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
నల్గొండ: కోడి ధరను దాటేసిన చిక్కుడుకాయ
నల్గొండ: స్థానికంపై ఆ మూడు పార్టీల కన్ను
కట్టంగూరు: అభ్యర్ధులకు ఎస్సై సూచన
కట్టంగూరు: రెండు సార్లు ఆయనే విన్
మునుగోడు: ప్రశ్నించే గొంతుకులను గెలిపించండి
News November 27, 2025
విదేశీ పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం: శ్రీధర్ బాబు

విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అనుకూల గమ్యస్థానమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐటీ, ఏరోస్పేస్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా రంగాలకు ఎకో సిస్టమ్ను రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. HYD సచివాలయంలో గురువారం జర్మన్ ఫ్రీడరిక్- ఎబర్ట్- స్టిఫ్టంగ్ ఫౌండేషన్ ప్రతినిధులు డా.సబీన్ ఫాండ్రిక్ మిర్కో గుంథర్, క్రిస్టోఫ్ మోహ్ర్ చర్చించారు. ఆయనతో పాటు పాటు RGM MLA మక్కన్ సింగ్ ఠాకూర్ ఉన్నారు.


