News February 2, 2025
నారాయణపేట జిల్లాలో భారీ మొసలి కలకలం

నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఉదయం మొసలి కలకలం రేపింది. గ్రామ రైతు పొలంలో వెళ్తుండగా ఒడ్డున మొసలి కనిపించిందని తెలిపారు. పొలం మధ్యలో మొసలి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందించారు. అటువైపు వెళ్లవద్దని, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Similar News
News February 15, 2025
అభివృద్ధి పనులు చేపట్టాలి: ఆసిఫాబాద్ కలెక్టర్

ప్రధానమంత్రి శ్రీ పథకం క్రింద జిల్లాలో ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి నెల చివరి వారంలో పూర్తి చేసే విధంగా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.
News February 15, 2025
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
News February 15, 2025
ఫిబ్రవరి 15: చరిత్రలో ఈరోజు

1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జననం
1739: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జననం
1964: సినీ దర్శకుడు, నిర్మాత అశుతోశ్ గోవారికర్ జననం
1982: సినీ నటి మీరా జాస్మిన్ జననం