News March 11, 2025
నారాయణపేట జిల్లాలో వేసవి గండం..!

నారాయణపేట జిల్లాలోని పలు చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోతున్నాయి. గత ఏడాది నీటి వనరులతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితి కాస్త నయమనిపిస్తున్నా, కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే వేసవి నేపథ్యంలో జల వనరుల పరిస్థితి ఆందోళన కల్గిస్తుందని రైతులు అంటున్నారు. ఇదే సమయంలో మరికొన్ని గ్రామాల్లో చెరువులు అడుగంటి కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా తగ్గిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
Similar News
News November 22, 2025
HYD: వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరం: సీపీ

వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎంతో అవసరమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శుక్రవారం ఆయన పోలీస్ సిబ్బంది కోసం నిర్వహిస్తున్న పాతబస్తీ పేట్ల బురుజు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం ఎంతో అవసరమన్నారు.

వైభవంగా రామయ్య నిత్య కళ్యాణ వేడుక

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం సీతారామచంద్ర స్వామికి అత్యంత వైభవోపేతంగా నిత్య కళ్యాణ వేడుకను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అంతరాలయంలో స్వామివారికి అభిషేకాలను నిర్వహించారు. వేదమంత్రాల నడుమ స్వామివారిని నిత్య కళ్యాణం మండపంలో వేయించేసి నిత్య కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.