News March 21, 2025
నారాయణపేట జిల్లాలో 99.7% మంది హాజరు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు DEO గోవిందరాజులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 39 పరీక్ష కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. ఈరోజు పరీక్షలకు 99.7% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 7,635 మందికి 7,613 మంది పరీక్షలకు హాజరయ్యారు. కాగా 22 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. వన్స్ ఫీల్డ్ క్యాండిడేట్స్ 6 మందికి 03 హాజరుకాగా 3 గైర్హాజరైనట్లు తెలిపారు.
Similar News
News November 21, 2025
ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. పిండిమరతో బాంబుల తయారీ!

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో అరెస్టైన పుల్వామాకు చెందిన ముజమ్మిల్ షకీల్ గనై కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతను బాంబుల తయారీకి పిండిమరతో కెమికల్స్‌ను తయారు చేసినట్లు NDTV పేర్కొంది. ఫరీదాబాద్‌లోని తన రూమ్‌ను ఇందుకు వాడుకున్నాడని తెలిసింది. NOV 9న పోలీసులు ఇతని రూమ్‌లో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. యూరియాని పిండిమరలో వేసి అమ్మోనియం నైట్రేట్ తయారు చేసినట్లు సమాచారం.
News November 21, 2025
అనంతపురం మొదటి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన తీర్పు

గంజాయి సరఫరా, విక్రయాలకు పాల్పడిన ఐదుగురి ముఠాకు 10 ఏళ్లు జైలు శిక్ష, చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ అనంతపురం మొదటి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. (గంగాధర్, స్వాతి, ప్రసాద్, షేక్ గౌసియా, షేక్ అలీ) నిందితులకు శిక్ష పడేలా కృషిచేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ జగదీశ్ అభినందించారు. షేక్ అలీ గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామం కాగా మిగిలిన నలుగురు అనంతపురానికి చెందినవారే.
News November 21, 2025
వేములవాడ ఏఎస్పీగా రుత్విక్ సాయి కొట్టే

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏఎస్పీగా రుత్విక్ సాయి కొట్టే నియమితులయ్యారు. గ్రేహౌండ్స్ విభాగం ఏఎస్పీగా పనిచేస్తున్న 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయనను వేములవాడకు బదిలీ చేస్తూ శుక్రవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేములవాడలో అదనపు ఎస్పీ హోదాలో పనిచేస్తున్న శేషాద్రిని రెడ్డిని జగిత్యాల అదనపు ఎస్పీ (పరిపాలన)గా నియమించారు.


