News April 15, 2025
నారాయణపేట జిల్లా అధికారుల సీరియస్ WARNING

బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా కార్మిక శాఖ అధికారి మహేశ్ కుమార్ హెచ్చరించారు. చైల్డ్ హెల్ప్ లైన్‌కు అందిన సమాచారం మేరకు సోమవారం మక్తల్ మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టిలో తనిఖీలు చేసి అక్కడ పని చేస్తున్న బాల కార్మికులను చైల్డ్ హోమ్ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. ఎక్కడైనా బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News November 4, 2025
వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు ఇలా..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,920 పలకగా.. నేడు రూ. 30 పెరిగి, రూ.6,950 అయినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. మార్కెట్‌కు సుమారు 12 వేల పత్తి బస్తాలు వచ్చినట్లు చెప్పారు. కాగా వర్షం కారణంతో మార్కెట్లో కొనుగోళ్లకు అంతరాయం కలిగింది.
News November 4, 2025
ఫ్లాప్స్ వచ్చినా ఆఫర్లకు కొదవలేదు..

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా హీరోయిన్ శ్రీలీల హవా కొనసాగుతోంది. పెళ్లి సందడితో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ధమాకా, భగవంత్ కేసరి వంటి హిట్లు ఖాతాలో వేసుకున్నారు. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం, మాస్ జాతర అలరించలేకపోయాయి. 10కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి సక్సెస్ రేట్ 30శాతమే ఉంది. ప్రస్తుతం శ్రీలీల 3-4 సినిమాల్లో నటిస్తున్నారు.
News November 4, 2025
‘Admin123’.. అంతా కొట్టేశాడు!!

గుజరాత్ హ్యాకర్ పరిత్ ధమేలియా 2024లో ఢిల్లీ, నాసిక్, ముంబై తదితర నగరాల్లో 50K CCTV క్లిప్స్ తస్కరించాడు. విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లోని ఈ క్లిప్స్ పోర్న్ మార్కెట్లో అమ్మేశాడు. మొదట రాజ్‌కోట్ పాయల్ ఆస్పత్రిలో గైనకాలజీ టెస్ట్స్ ఫుటేజ్ కోసం CCTV హ్యాక్ చేస్తే పాస్వర్డ్ Admin123 అని తెలిసింది. ఇదే పాస్‌వర్డ్‌తో ఇతర నగరాల్లోనూ హ్యాక్ చేశాడు. ఈ Febలో అరెస్టైన పరిత్ నేర వివరాలు తాజాగా బయటకొచ్చాయి.


