News June 23, 2024
నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చెయ్యాలి: సీఎం
నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హైదరాబాదులోని రాష్ట్ర ముఖ్యమంత్రి నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 4, 2024
MBNR: మూడేళ్ల బాలికపై హత్యాచారయత్నం
మూడేళ్ల బాలికపై ఓవ్యక్తి హత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన MBNRలో జరిగింది. రూరల్ CI గాంధీనాయక్ కథనం.. MBNRలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఓ దుకాణ నిర్వహకుడి కూతురు(3) ఆదివారం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటుంది. అక్కడే ఓ హోటల్‌లో పనిచేసి వ్యక్తి బాలికను పక్కకు తీసుకువెళ్లి గొంత నులిమి, దుస్తులు విప్పేందుకు యత్నించాడు. స్థానికులు, తల్లిదండ్రులు గమనించి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
News November 4, 2024
పాలమూరు జిల్లాలో మీ సేవలు బంద్..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం మీ సేవ కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టినట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. మీ సేవలు ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఆర్టీసీ కళా భవన్‌లో 14వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని మీ సేవ నిర్వాహకులందరూ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు బంద్ ప్రకటించారు. మంగళవారం యథావిధిగా కార్యాలయాలు కొనసాగుతాయన్నారు.
News November 4, 2024
ఉమ్మడి జిల్లాకు నేడు వర్ష సూచన
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైతులు, అధికారులకు ముందస్తు జాగ్రత్తలు సూచించింది.