News March 19, 2025

నారాయణపేట జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు 

image

నారాయణపేట జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో హౌసింగ్, డీఆర్డీఏ, విద్యాశాఖ, ఆరోగ్య, పీఆర్, డీపీవో, మున్సిపల్ శాఖల అధికారులతో ఆయా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలు గ్రౌండింగ్‌లో జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉందని, నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు.

Similar News

News February 25, 2026

విజయ్-రష్మిక పెళ్లి.. ఇండస్ట్రీ గెస్ట్ లిస్ట్ ఇదే

image

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుక జరుగుతున్నప్పటికీ.. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వీరిలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, శ్రావ్య వర్మ, ఆషికా రంగనాథ్, రాహుల్ రవీంద్రన్ వంటివాళ్లు ఉన్నారు. రేపు జరగనున్న ఈ పెళ్లికి మొత్తంగా 100 మంది మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం.

News February 25, 2026

పాకిస్థానీల బెదిరింపులు.. లండన్‌లో ఇండియన్ రెస్టారెంట్ బంద్!

image

లండన్‌లో 16 ఏళ్లుగా భారతీయ వంటకాలను వడ్డిస్తున్న ‘రంగ్‌రేజ్’ రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు దాని ఓనర్ హర్మన్ సింగ్ కపూర్ ప్రకటించారు. పాకిస్థానీల నుంచి ఎదురవుతున్న దాడులు, ఆన్‌లైన్ వేధింపులు, పోలీసుల నుంచి సరైన మద్దతు లభించకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆరోపించారు. ఖలిస్థాన్ ఉద్యమాన్ని విమర్శిస్తూ SMలో వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి కపూర్ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం.

News February 25, 2026

‘కేరళం’ సరే.. ప్రాజెక్టులేవీ: శశి థరూర్

image

కేరళ పేరును ‘కేరళం’గా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై MP శశి థరూర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మలయాళంలో ఇప్పటికే కేరళం అనే పిలుస్తారని, ఇప్పుడు ఆ పదాన్ని ఇంగ్లీషులోకి తీసుకురావడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. పేరు మార్పుపై చూపిస్తున్న శ్రద్ధను రాష్ట్ర అభివృద్ధిపై చూపడం లేదని విమర్శించారు. బడ్జెట్‌లో కేరళకు ఒక్క కొత్త ప్రాజెక్టూ ఇవ్వలేదని, AIIMS వంటి కీలక సంస్థలను కేటాయించలేదని ఆరోపించారు.