News April 2, 2025

నారాయణపేట జిల్లా పోలీసుల WARNING

image

నారాయణపేట జిల్లాలో ఈనెల 30 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ యోగేశ్ గౌతమ్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు, యువజన, రైతు, విద్యార్థి సంఘాలు ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించొద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News April 5, 2025

సినిమాలను వృత్తిగా చూడలేదు: తమన్నా

image

ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నందుకు హీరోయిన్ తమన్నా సంతోషం వ్యక్తం చేశారు. స్కూల్ డేస్‌లోనే సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు. చదువు విషయంలో టీచర్లు తనకు ఎంతగానో సహకరించారని చెప్పారు. తన 21వ పుట్టిన రోజున పేపర్లో తనపై వచ్చిన ప్రత్యేక కథనం చూసి కన్నీరు పెట్టుకున్నట్లు వెల్లడించారు. సినిమాలను తానెప్పుడూ వృత్తిగా చూడలేదన్నారు. కాగా తమన్నా నటించిన ‘ఓదెల2’ ఈ నెల 17న రిలీజ్ కానుంది.

News April 5, 2025

IPL: పీకల్లోతు కష్టాల్లో CSK

image

ఢిల్లీతో మ్యాచులో 184రన్స్ టార్గెట్ ఛేదించడానికి చెన్నై కష్టపడుతోంది. రన్స్ రాబట్టేందుకు ఆ జట్టు ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి CSK 5 కీలక వికెట్లు కోల్పోయి 74 పరుగులు మాత్రమే చేసింది. రచిన్ 3, కాన్వాయ్ 13, గైక్వాడ్ 5, దూబే 18, జడేజా 2 రన్స్‌కు ఔటయ్యారు. క్రీజులో ధోనీ, విజయ్ శంకర్ ఉన్నారు. విజయానికి 54 బంతుల్లో 107 పరుగులు కావాలి. మరి టార్గెట్‌ను CSK ఛేదించగలదా? కామెంట్ చేయండి.

News April 5, 2025

YELLOW ALERT.. రెండు రోజులు వర్షాలు

image

తెలంగాణలో ఈ నెల 7,8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు పొడి వాతావరణం ఉంటుందని, 7న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. 8న కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

error: Content is protected !!