News April 5, 2025

నారాయణపేట జిల్లా ప్రజలకు WARNING

image

సైబర్ మోసగాళ్ల మాయమాటలు నమ్మొద్దని, కేటుగాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ శుక్రవారం హెచ్చరించారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా టోల్ ఫ్రీ 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఆన్‌లైన్‌లో https://www.cybercrime.gov.in సైతం ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వకూడదన్నారు. SHARE IT

Similar News

News October 30, 2025

జనగామ: రైతులకు అండగా ఉండండి: కలెక్టర్

image

వర్షాల నేపథ్యంలో రైతులకు అండగా ఉండాలని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.

News October 30, 2025

నిర్మల్ పట్టణంలో ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం

image

నిర్మల్ పట్టణంలో గురువారం ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ నివారణ దినోత్సవం సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, నిర్మూలన మార్గాలకు సంబంధించిన విషయాలపై అవగాహన కలిగేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

News October 30, 2025

ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ

image

ప్రకాశం బ్యారేజ్‌కి వరద ఉద్ధృతి పెరుగుతుంది. గురువారం సాయంత్రం 7గంటలకు వరద 5.66 లక్షల క్యూసెక్యులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజ్ నీటిమట్టం 15 అడుగులకు చేరింది. అధికారులు అన్ని గేట్లు ఎత్తి 5.66 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.