News March 19, 2025
నారాయణపేట జిల్లా బిడ్డ సత్తా..!

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన కనకప్ప పారా అథ్లెటిక్ ఖేలో ఇండియా జాతీయ స్థాయి లాంగ్ జంప్ క్రీడలకు ఎంపికైనట్లు అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రమణ బుధవారం తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. జాతీయ స్థాయి క్రీడలకు విద్యార్థి ఎంపిక కావడంపై క్రీడాకారులు, క్రీడాభిమానులు, అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News October 16, 2025
గద్వాల: హాస్టల్ విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం భోజనం

2025-26 విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ-మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం ఐడీఓసీ మందిరంలో సంబంధిత అధికారులతో కొత్త మెనూ పోస్టర్ ఆవిష్కరించారు. ఇకపై జిల్లాలోని అన్ని హాస్టళ్లలో కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ఇవ్వాలన్నారు. కిచెన్ షెడ్లు, వంట పాత్రలు శుభ్రంగా ఉంచుకుని, నాణ్యమైన ఆహారం ఇవ్వాలని సూచించారు.
News October 16, 2025
అనకాపల్లి: రేపు ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్

అనకాపల్లి కలెక్టరేట్లో శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ జాహ్నవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే గ్రీవెన్స్లో వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలపై అర్జీలు అందజేయవచ్చునని అన్నారు. గత నెలలో జరిగిన గ్రీవెన్స్లో అర్జీలు అందజేసిన ఉద్యోగులు వచ్చి వాటి స్థితిని తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.
News October 16, 2025
జూబ్లీహిల్స్లో బై‘పోల్’ పరేషాన్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. ఇక్కడ ఓటు వేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇది ఈసారేకాదు నియోజకవర్గం కొత్తగా ఏర్పడినప్పటి నుంచీ జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో 56 శాతం, 2018లో 47.58 శాతం, 2023లో 45.59 శాతం పోలింగ్ జరిగింది. అంటే పదేళ్లలో దాదాపు 10 శాతం పడిపోయింది. మరి ఈసారి ఎంత శాతం నమోదవుతుందో చూడాలి.