News April 2, 2025
నారాయణపేట: ‘పాపన్న గౌడ్ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి’

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి నిర్వహించారు. అదనపు కలెక్టర్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బడుగుబలహీన వర్గాలకు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
Similar News
News February 22, 2026
తప్పిన వర్షం ముప్పు.. టాస్ గెలిచిన శ్రీలంక

T20WC: సూపర్-8 రెండో మ్యాచ్ పల్లెకెలెలో శ్రీలంక-ఇంగ్లండ్ మధ్య జరగనుంది. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. నిన్నటి నుంచి అక్కడ వర్షం పడుతుండటంతో పాక్-న్యూజిలాండ్ మ్యాచ్ మాదిరే రద్దు అవుతుందని అంతా భావించారు. కాగా సూర్యుడి రాకతో వాతావరణ పరిస్థితులు మెరుగుపడి మ్యాచ్ నిర్వహణకు వీలు పడింది.
News February 22, 2026
సునీల్ కుమార్ సస్పెన్షన్ మరోసారి పొడిగింపు

AP: CID మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. క్రిమినల్ కేసు పూర్తవడం లేదా రిటైర్మెంట్‌లో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అలాగే అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే అభియోగాలున్నాయి.
News February 22, 2026
రేపు అన్ని చోట్లా పీజీఆర్ఎస్: కలెక్టర్

జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంటుందని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. అర్జీ పరిష్కార స్థితి గురించి తెలుసుకోవడానికి వెబ్‌సైట్& టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చన్నారు.


