News April 11, 2025
నారాయణపేట: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలానికి చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఇదే మండలానికి చెందిన టప్ప భాను అనే నిందితుడికి గురువారం జిల్లా న్యాయమూర్తి అబ్దుల్ రఫీ 26 ఏళ్ల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. 2024 మార్చి 17న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం కోర్టు తీర్పు వెల్లడించిందని చెప్పారు.
Similar News
News November 27, 2025
స్మోకింగ్, డ్రింకింగ్ కంటే ఒత్తిడి డేంజర్ అని తెలుసా?

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే వేగంగా ఆయువును ఒత్తిడి హరిస్తుందని ఓ ఆర్థోపెడిక్ సర్జన్ తెలిపారు. ‘ఒత్తిడి కేవలం మానసిక సమస్య కాదని చాలామందికి తెలియదు. అది పూర్తి బాడీకి సంబంధించినది. ఒత్తిడికి గురైనప్పుడు శరీరం కార్టిసాల్, అడ్రినలిన్ రిలీజ్ చేస్తుంది. వెన్నునొప్పి, తలనొప్పి, పళ్లు కొరకడం, కండరాలు పట్టేయడం వంటి వాటికీ ఒత్తిడే కారణం’ అని చెప్పారు. 7-8 గంటల నిద్రతోనే ఒత్తిడిని ఎదుర్కోగలమన్నారు.
News November 27, 2025
NZB: జి.జి.కళాశాలలో కృత్రిమ మేధపై జాతీయ సదస్సు

స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “కృత్రిమ మేధ యుగంలో విజ్ఞాన శాస్త్రాలకు ఉన్న అవకాశాలు & అవరోధాలు”అంశంపై జరుగుతున్న జాతీయ సదస్సును TU వైస్ ఛాన్స్లర్ ప్రొ. టి. యాదగిరి రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొ.ఆర్.సాయన్న, ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి, సమన్వయకర్త రామకృష్ణ, ప్రారంభించి, సావనీర్ ఆవిష్కరించారు.
News November 27, 2025
ములుగు జిల్లాలో ‘ఆమె’ ఓట్లే అధికం..!

ములుగు జిల్లాలోని 10 మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 2,29,159 ఓటర్లు ఉండగా, అందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే 7,461 మంది మహిళలు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మంగపేటలో 19,913 మహిళా ఓటర్లు ఉండగా, అత్యల్పంగా కన్నాయిగూడెంలో 5,085 మహిళా ఓటర్లు ఉన్నారు.


