News April 11, 2025
నారాయణపేట: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలానికి చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఇదే మండలానికి చెందిన టప్ప భాను అనే నిందితుడికి గురువారం జిల్లా న్యాయమూర్తి అబ్దుల్ రఫీ 26 ఏళ్ల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. 2024 మార్చి 17న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం కోర్టు తీర్పు వెల్లడించిందని చెప్పారు.
Similar News
News November 28, 2025
డిసెంబర్ 4న భారత్‌కు పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. DEC 4, 5వ తేదీల్లో జరగనున్న 23వ ఇండియా-రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలో పాల్గొంటారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై USలో అదనపు సుంకాలు విధించిన వేళ పుతిన్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.
News November 28, 2025
HYD: ప్లీజ్.. పిల్లలను టెన్షన్ పెట్టకండి

పేట్ బషీరాబాద్ PS పరిధిలో స్కూల్ ఫీజు చెల్లించలేకపోవడంతో 8వ తరగతి విద్యార్థి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. తప్పు యాజమాన్యానిదైనా.. తల్లిదండ్రులదైనా ఘోరం జరిగిపోయింది. చదువుకోవాలని ఉన్నా చదువు”కొనలేని” స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులూ ఇప్పటికైనా మారండి మేనేజ్ మెంట్‌తో మాట్లాడండి. పిల్లలకు సర్దిచెప్పండి. యాజమాన్యాలు కఠిన వైఖరి తగ్గించాలి. లేకపోతే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి.
News November 28, 2025
12 కాదు.. వచ్చే ఏడాది 13 మాసాలు ఉంటాయి!

సాధారణంగా ఏడాదికి 12 మాసాలే ఉంటాయి. అయితే 2026, MAR 30న మొదలయ్యే పరాభవ నామ సంవత్సరంలో 13 మాసాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠానికి ముందు అధిక జ్యేష్ఠం రావడమే దీనికి కారణం. ‘దీనిని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఇది శ్రీమహా విష్ణువుకు ప్రీతిపాత్రం. అధిక మాసంలో పూజలు, దానధర్మాలు, జపాలు చేస్తే ఎంతో శ్రేష్ఠం’ అని పండితులు సూచిస్తున్నారు. SHARE IT


