News February 4, 2025
నారాయణపేట: భార్య ఆత్మహత్య.. భర్తకు జైలు శిక్ష

భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు జైలు శిక్ష పడింది. కర్ణాటకలోని యాదగిరి జిల్లాకు చెందిన మహేశ్కు పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వెలు జరిమానా విధిస్తూ మంగళవారం న్యాయమూర్తి అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. అదనపు కట్నం తేవాలని వేధించడంతో 2023 మే 31న నారాయణపేట (M) సింగారం గ్రామానికి చెందిన భవాని ఉరేసుకుందని, ఆమె అన్న భరత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News December 12, 2025
అల్లూరి జిల్లా: సహాయక చర్యలు వేగవంతం చేయాలి.. రవాణా శాఖ మంత్రి

అల్లూరి జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై మంత్రి వెంటనే స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా రవాణా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెంటనే రిపోర్ట్ చేయాలని సూచించారు.
News December 12, 2025
ఖమ్మం: కోడలిపై సర్పంచిగా గెలిచిన అత్త

బోనకల్ మండలం చిన్న బీరవల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచి అభ్యర్థి చండ్ర సరిత విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బావగారి కోడలు శ్రీలక్ష్మిపై సరిత 23 ఓట్ల స్వల్ప మెజార్టీతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఫలితాల అనంతరం సరిత అనుచరులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సవాలు జరుపుకున్నారు.
News December 12, 2025
ఈ సీజన్లోనే అత్యల్పం.. జి.మాడుగుల@3.2డిగ్రీలు

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అతి శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. నిన్న APలోని అల్లూరి(D) జి.మాడుగులలో అత్యల్పంగా 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ సీజన్లో ఇదే రికార్డు. డుంబ్రిగూడలో 3.6, అరకులో 3.9, ముంచంగిపుట్టులో 4.4డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. TGలోని ఆసిఫాబాద్(D) గిన్నెధరిలో 5.4, కెరమెరిలో 5.7, తిర్యాణిలో 5.8డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


