News April 1, 2025

నారాయణపేట: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య 

image

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో చోటుచేసుకుంది. మరికల్ ఎస్ఐ రాము కథనం మేరకు.. తీలేరు గ్రామానికి చెందిన సుభాష్‌కు తన భార్యకు కొన్ని రోజుల క్రితం గొడవలు జరగగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రమ్మన్నా ఆమె రాకపోవడంతో మనస్తాపం చెందిన సుభాష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News April 4, 2025

రైల్వే స్టేషన్‌లో వ్యర్థాలకు నిప్పు.. వందే భారత్‌కు తప్పిన ముప్పు

image

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో వ్యర్థాలకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. దీంతో పొగ కమ్ముకోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో అటువైపు వందే భారత్ రైలు రావడంతో సిబ్బంది అప్రమత్తమై కొంతసేపు రైలును ఆపేశారు. స్థానికులు మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదంతప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News April 4, 2025

రామచంద్రపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

రామచంద్రపురం బైపాస్ రోడ్‌లో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని పి.గన్నవరం మండలం గంటి పెదపూడికి చెందిన వీరి సాయి వెంకటకృష్ణ (20) మృతి చెందాడు. దాసరి శ్రీనుతో కలిసి బైక్‌పై కాకినాడ నుంచి స్వగ్రామం గంటి పెదపూడి వెళ్తుండగా వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటకృష్ణ అక్కడికక్కడే చనిపోగా దాసరి శ్రీను గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 4, 2025

NZB: కూలీ పనికి వెళ్లి.. మృత్యు ఒడిలోకి

image

నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన గంగాధర్ గురువారం గోదావరి నదిలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. గోదావరి నదిలో పాడైపోయిన బోరు మోటారును తీయడానికి గంగాధర్ కూలీ పనికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

error: Content is protected !!