News April 7, 2025

నారాయణపేట: ‘మాంసం వారానికి ఒకసారే తినండి’

image

ఉమ్మడి <<16019120>>పాలమూరులో<<>> 18 ఏళ్లు పైబడిన వారిలో సగటున 20 శాతం అంటే 87,739 మంది అధిక రక్తపోటు బాధితులే ఉన్నారు. క్యాన్సర్ రోగులు 188 మంది, మధుమేహ వ్యాధిగ్రస్థులు 50,421 మంది ఉన్నారు. మటన్, ఆయిల్‌ఫుడ్, అధిక ఉప్పు, పచ్చడి, తంబాకు, గుట్కా, బ్రెడ్, బేకరీ ఫుడ్ తినొద్దని, స్కిన్‌లెస్ చికెన్, గుడ్డు తెల్ల సొన, ఉడకబెట్టిన కూరగాయలు, పాలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే మాంసం తినాలన్నారు.

Similar News

News December 11, 2025

క్రీడారంగం అభివృద్ధిపై రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపీ సతీష్

image

రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఖేలో ఇండియా కార్యక్రమాలపై రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ గురువారం రాజ్యసభలో ప్రస్తావించారు. దీనికి కేంద్రం క్రీడాశాఖ మంత్రి మాండవీయ బదులిస్తూ రాష్ట్రాల వారీగా కాకుండా పథకాల వారీగా నిధులు ఇస్తున్నట్లు తెలిపారని ఎంపీ కార్యాలయం వెల్లడించింది. గత ఐదేళ్లుగా కాకినాడ జిల్లాలకు క్రీడల కోసం నిధుల మంజూరుపై రికార్డులు లేవని మంత్రి తెలిపారన్నారు.

News December 11, 2025

MDK: ఆ ఊరిలో ఒక్క ఓటు తేడాతో గెలుపు

image

రేగోడ్ మండలంలో కొండాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బేగరి పండరి విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి హరిజన సత్తయ్య మీద ఒక ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ పార్టీ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.

News December 11, 2025

VJA: గుండు కొట్టించు.. వంద సమర్పించు.!

image

భవానీ మాల విరమణకు వచ్చిన భక్తుల నుంచి కేశఖండన శాలల సిబ్బంది అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. తలనీలాలు సమర్పించేందుకు టికెట్‌‌కు రూ.40 ఉన్నప్పటికీ, అదనంగా రూ.100 ఇవ్వాలని క్షవరకులు డిమాండ్ చేస్తున్నారు. ముందు డబ్బులు ఇస్తేనే గుండు చేస్తామని ఆంక్షలు పెడుతున్నారు. మైకుల్లో డబ్బులు చెల్లించవద్దని ప్రకటిస్తున్నా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.