News April 11, 2025
నారాయణపేట: మార్కెట్లో ధరలు లేక ఉల్లి రైతుల ఆందోళన

ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ఉల్లి ధరలు లేకపోవడంతో నారాయణపేటలోని పలువురు రైతులు పంటను కోసి పొలాల వద్ద నిల్వ చేశారు. మార్కెట్లో రోజు రోజుకు ఉల్లి ధరలు పడిపోతుండడమే ఇందుకు కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి పెరిగినా.. తగ్గినా గిట్టుబాటు ధరలు లేక రైతులు కోసిన ఉల్లి పంటను పొలాల వద్ద, ఇంటి వద్ద నిల్వ చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు పెరుగుతాయన్న ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.
Similar News
News November 21, 2025
మాజీ మంత్రి శైలజానాథ్‌కు మాతృవియోగం

శింగనమల వైసీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తల్లి సాకే గంగమ్మ మృతి చెందారు. అనంతపురంలోని రామకృష్ణ నగర్లో నివాసం ఉంటున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో శైలజానాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు శైలజానాథ్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News November 21, 2025
నెల్లూరులో చేపల సాగుకు ప్రాధాన్యత

రొయ్యలకంటే చేపల సాగుకే నెల్లూరులో ప్రాధాన్యత పెరుగుతోంది. తక్కువ ఖర్చులు, స్థిరమైన చరల కారణంగా చేపల పెంపకం ఏటా విస్తరిస్తోంది. జిల్లాలో 5 వేల ఎకరాల్లో గెండి, బొచ్చ, మోసు, రూప్‌చంద్ చేపలు ప్రధానంగా సాగు అవుతున్నాయి. సంవత్సరానికి సగటుగా 1.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. ఇందులో గెండి 10%, బొచ్చ 35%, మోసు 3% ఉత్పత్తి. చేపలను తమిళనాడు, కర్ణాటక, కేరళ, ప.బెంగాల్‌కి ఎగుమతి చేస్తున్నారు.
News November 21, 2025
HYD: చేవెళ్ల హైవేపై మరో ఘోర ప్రమాదం

చేవెళ్ల ట్రాఫిక్ PS పరిధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. మొయినాబాద్‌లోని తాజ్ సర్కిల్ సమీపంలో కనకమామిడి వెళ్లే రూట్లో 2 కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


