News February 11, 2025
నారాయణపేట మార్కెట్లో పెరిగిన వేరుశనగ ధరలు

నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ ధరలు కాస్త పెరిగాయి. మంగళవారం 520.80 క్వింటాళ్ల వేరుశనగ రాగ, క్వింటాలుకు గరిష్టంగా రూ. 6,269, కనిష్టంగా రూ. 3,869 ధర పలికింది. అదేవిధంగా 54.39 క్వింటాళ్ల తెల్ల కందులు రాగ, క్వింటాలుకు గరిష్టంగా రూ. 8,000, కనిష్టంగా రూ. 6,212, 122.50 క్వింటాళ్ల ఎర్ర కందులు రాగ, గరిష్టంగా క్వింటాలుకు రూ. 7,750, కనిష్టంగా రూ. 6,222 ధర పలికిందని అన్నారు.
Similar News
News October 20, 2025
జనగామ: మద్యం టెండర్ల దాఖలకు గడువు పొడిగింపు

మద్యం టెండర్ల దాఖలుకు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు జనగామ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అనిత తెలిపారు. జిల్లాలోని 50 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించగా ఇప్పటి వరకు 1,600 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. గడువు పొడిగించడంతో మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయన్నారు.
News October 20, 2025
మంచిర్యాల: పండగపూట భార్యను చంపిన భర్త

పండుగ పూట మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద గృహిణి హత్యకు గురైంది. ఆమె భర్త కుమార్ గొంతు నులిమి చంపి బ్రిడ్జిపై నుంచి పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
News October 20, 2025
VKB: అనంతపద్మనాభ స్వామి ఆలయం మూసివేత

వికారాబాద్కు సమీపంలోని మహిమాన్విత అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని అమావాస్యను పురస్కరించుకుని తాత్కాలికంగా మూసివేశారు. ఈ విషయాన్ని ఆలయ మేనేజర్ నరేందర్ తెలిపారు. నిత్యం భక్తులు సందర్శించి, మొక్కులు తీర్చుకునే ఈ ఆలయాన్ని అమావాస్య ముగిసిన తర్వాత శుద్ధి చేసి తిరిగి తెరుస్తామని ఆయన వివరించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.