News March 22, 2025

నారాయణపేట: మే 10న మీ కోసమే..!

image

మే 10న జరిగే లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పోలీస్, ఎక్సైజ్, కోర్టు అధికారులు చెప్పారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కోర్టు సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ నిర్వహించారు. లోక్ అదాలత్ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని అన్నారు. డీఎస్పీ లింగయ్య, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 18, 2025

TCS లే ఆఫ్స్‌పై ఉద్యోగుల ఫిర్యాదు

image

USలోని TCS కంపెనీపై ఆ దేశ ‘సమాన ఉపాధి హక్కుల కమిషన్’ విచారణ చేపట్టింది. ఇండియాకు చెందిన హెచ్1బీ వీసాదారులకు లేఆఫ్స్ ఇవ్వకుండా కేవలం దక్షిణాసియేతర ఉద్యోగులనే పక్షపాతంగా తొలగిస్తున్నారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఆరోపణలను TCS ప్రతినిధులు ఖండించారు. మెుదటి నుంచి TCS సంస్థ సమానత్వం, సమగ్రత కల్పించడంతో ముందు స్థానంలో ఉంటుందని తెలిపారు.

News April 18, 2025

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

image

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో వీటికి చోటు దక్కింది. ఇది ప్రపంచంలోని ప్రతీ భారతీయుడికి గర్వకారణమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా దేశ నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు.

News April 18, 2025

సంగారెడ్డి: జిల్లాకు వచ్చిన యూనిఫామ్ క్లాత్

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం అందించే ఉచిత యూనిఫామ్ క్లాత్ ఈ సంవత్సరం కూడా జిల్లా కేంద్రానికి చేరుకుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి వివిధ మండలాలకు పంపించనున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు యూనిఫామ్‌ను కుట్టి పాఠశాలల ప్రారంభం నాటికి అందించాలని డీఈఓ పేర్కొన్నారు.

error: Content is protected !!