News March 22, 2025
నారాయణపేట: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT
Similar News
News November 22, 2025
వారం రోజులు కన్నాల రైల్వే గేటు మూసివేత

పాలకుర్తి మండలం కన్నాల రైల్వే గేటును వారం రోజులు మూసివేస్తున్నట్టు శనివారం రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 23వ తేదీ ఆదివారం నుంచి 29 వరకు కన్నాల లెవెల్ క్రాసింగ్ 46 వద్ద 3వ రైల్వే ట్రాక్ బేస్ తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నందున గేట్ క్లోజ్ చేస్తున్నట్టు అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. కావున ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ దారిని ఎంచుకుని రైల్వే శాఖకు సహకరించాలని కోరారు.
News November 22, 2025
రేపు రాష్ట్ర పండుగగా పుట్టపర్తి సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు

రాష్ట్ర పండుగగా పుట్టపర్తి సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం తెలిపారు. ఆదివారం సత్యసాయిబాబా జన్మదిన వేడుకను అధికారికంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, కలెక్టరేట్ వద్ద సత్య సాయిబాబా జన్మదిన వేడుకలు నిర్వహించాలన్నారు.
News November 22, 2025
‘స్వయం సహాయక గ్రూపుల్లో కిశోర బాలికలకు అవకాశం’

స్వయం సహాయక గ్రూపుల్లో 15- 18 ఏళ్ల వయసున్న కిశోర బాలికలకు అవకాశం కల్పిస్తామని, 60 ఏళ్లు దాటిన మహిళలకూ సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తామని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. బోయినిపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో కొత్తగా 5,560 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో చేరారని వివరించారు.


