News April 4, 2025

నారాయణపేట: రాజీవ్ యువ వికాస పథకంపై సమీక్ష

image

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై నారాయణపేట కలెక్టరేట్ సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News December 4, 2025

నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

News December 4, 2025

BREAKING: కడప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

image

కడపలో ఖాళీగా ఉన్న మేయర్ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నూతన మేయర్‌ను ఎన్నుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పూర్వపు మేయర్ సురేశ్ బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేయడంతో ఇన్‌ఛార్జ్ మేయర్‌గా ముంతాజ్ కొనసాగుతున్నారు. కడపలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి.

News December 4, 2025

విశాఖలో 100 కోట్ల స్కామ్.. స్నేహ మ్యాక్స్ సీఎండీ అరెస్ట్

image

విశాఖలో సంచలనం సృష్టించిన స్నేహ మ్యాక్స్ సొసైటీ సంస్థ వ్యవస్థాపకుడు శివ భాగ్యరావును టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దాదాపు రూ.100 కోట్లు డిపాజిట్ల రూపంలో సేకరించి మోసం చేసి బోర్డు తిప్పేయడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనే డైరెక్టర్లు, ముఖ్యమైన వ్యక్తులు అరెస్టు కాగా గురువారం శివ భాగ్యరావును అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ ఎర్రంనాయుడు తెలిపారు.