News April 5, 2025
నారాయణపేట: రాజీవ్ యువ వికాసం కోసం యువకుల తిప్పలు

నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసుకోవడం కోసం, వార్షిక ఆదాయ పత్రం తీసుకోవటానికి తహశీల్దార్ కార్యాలయానికి వెళితే అక్కడున్న అధికారులు అకారణంగా, ఎక్కువ ఆదాయాన్ని వేస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా యువకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పత్రాల్లో ఆదాయం ఎక్కువగా ఉండడంతో, పథకానికి అనర్హులుగా పరిగణిస్తారని యువకులు వాపోతున్నారు.
Similar News
News December 3, 2025
WGL: రెబల్స్ను బుజ్జగింపులు.. వేడెక్కిన రాజకీయాలు!

జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది. నేడు నామినేషన్ల ఉపసంహరణ కాగా, పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్స్ కూడా నామినేషన్లు వేయడంతో పలు గ్రామాల్లో గట్టి పోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలు రెబల్స్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈసారి తప్పుకో భవిష్యత్తులో అవకాశం ఇస్తాం అంటూ ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో స్వతంత్రులు బలంగా ఉండటం రాజకీయ సమీకరణాలను మార్చుతోంది.
News December 3, 2025
జిల్లా కేంద్రంగా రాజంపేట.. అర్హతలు ఇవే: JAC

రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి ఉన్న అర్హతలను JAC వివరించింది.
☛ 18 ఎకరాల విస్తీర్ణంలో సబ్ కలెక్టరేట్
☛ రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడిన నాటినుంచి పార్లమెంట్ కేంద్రం
☛ వివిధ నగరాలకు రైళ్ల సదుపాయం
☛ కృష్ణపట్నం ఓడరేవుకు కనెక్టివిటీ
☛ కడప, రేణిగుంట ఎయిర్పోర్టుకు సమీపం
☛ చెయ్యేరు, పెన్నా నదులు ప్రవహించడం
<<18453435>>CONTINUE..<<>>
News December 3, 2025
WGL: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో 564 జీపీలు, 4,896 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లకు ఈ నెల 5 వరకు అవకాశం ఉంది. స్క్రూటినీ 6న పూర్తి చేసి, ఉపసంహరణకు డిసెంబర్ 9 మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. పోలింగ్ ఈ నెల 17న జరగనుంది.


