News April 5, 2025

నారాయణపేట: రాజీవ్ యువ వికాసం కోసం యువకుల తిప్పలు

image

నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసుకోవడం కోసం, వార్షిక ఆదాయ పత్రం తీసుకోవటానికి తహశీల్దార్ కార్యాలయానికి వెళితే అక్కడున్న అధికారులు అకారణంగా, ఎక్కువ ఆదాయాన్ని వేస్తున్నారని, జిల్లా వ్యాప్తంగా యువకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పత్రాల్లో ఆదాయం ఎక్కువగా ఉండడంతో, పథకానికి అనర్హులుగా పరిగణిస్తారని యువకులు వాపోతున్నారు.   

Similar News

News April 20, 2025

ఎల్&టీ సంస్థకు LOA అందించిన సీఆర్డిఏ కమిషనర్

image

అమరావతిలో శాసనసభ భవన నిర్మాణ పనులు చేసేందుకు L1గా ఎల్ & టీ సంస్థ ఎంపికైంది. ఈ మేరకు శనివారం విజయవాడలోని CRDA కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబు ఎల్ & టీ సంస్థ ప్రతినిధులకు లెటర్ ఆఫ్ అవార్డు- LOA అందజేశారు. అమరావతిలో B+G+3 (బేస్‌మెంట్+ గ్రౌండ్+3) విధానంలో శాసనసభ భవనాలకు సంబంధించి రూ.617.33 కోట్ల పనులను ఎల్ & టీ చేపట్టనుంది.

News April 20, 2025

వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.

News April 20, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు….

image

:- ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ 10వ తరగతి పరీక్షలు:-ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు :-సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన :-వేంసూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం :-ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన :-ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

error: Content is protected !!