News March 30, 2024

నారాయణపేట: రూ.12లక్షల నగదు పట్టివేత

image

నారాయణపేట జిల్లా పరిధిలోని వివిధ చెక్‌ పోస్టుల వద్ద శుక్రవారం జరిగిన వాహన తనిఖీల్లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది. మరికల్ మండలం లాల్కోట చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా దేవరకద్ర మండలం గూరకొండ గ్రామానికి చెందిన బీరప్ప వద్ద రూ.8.40 లక్షలు, పేట మండలం ఎక్లాస్పూర్ చెక్‌పోస్టు వద్ద రూ.1.50 లక్షలు, దామరగిద్ద మండలం కాన్కుర్తి చెక్‌పోస్టు వద్ద రూ2.15 లక్షలను పట్టుకున్నారు.

Similar News

News April 16, 2026

MBNR: పీయూ..డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. వివేకానంద డిగ్రీ కళాశాలలో పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ కే.ప్రవీణ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ కే.ప్రవీణ మాట్లాడుతూ.. డిగ్రీ పరీక్షలు సజావుగా జరగాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మాస్ కాఫీయింగ్‌కు అవకాశం లేకుండా చూడాలని అధికారులను సూచించారు.

News April 16, 2026

జడ్చర్ల: పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలోని కొడుగల్ ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధి బిమ్లాగాని తండాకు చెందిన జనరల్ మెడిసిన్ పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్న సురేష్ హాస్టల్ రూంలో పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 16, 2026

సీసీ కుంట: శ్రావణి మృతి కేసులో మలుపు.. ప్రవీణ్ మృతి..!

image

చిన్నచింతకుంట(M) కురుమూర్తి స్వామి గుట్ట వద్ద బుధవారం నిన్న అనుమానాస్పదస్థితిలో మహిళ <<19658838>>మృతి చెందిన<<>> కేసు మలుపు తిరిగింది. ఎస్‌ఐ ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్(M) వెంకటాపూర్‌కు చెందిన శ్రావణి(26) మృతదేహం అనుమానాస్పదంగా లభించగా, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ అక్కడే స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతడిని 108లో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.