News January 29, 2025
నారాయణపేట: విద్యార్థి మృతి.. యువకుడికి జైలు

యువకుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి వింధ్య తీర్పునిచ్చింది. వివారలిలా.. మరికల్ PS పరిధిలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి MBNRలో ఇంటర్ చదువుతోంది. కన్మనూర్ వాసి వంశీ ప్రేమ పేరుతో వేధించడం, చంపేస్తానని బెదిరించడం, కొన్ని సార్లు ఆమెపై దాడి చేశాడు. మనస్తాపానికి గురై 2017 SEP 13 సూసైడ్ చేసుకుంది. నేరం రుజువు కావడంలో ఏడేళ్ల జైలు, రూ.20200 జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చారు.
Similar News
News December 9, 2025
సూర్యాపేటలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, మెప్మా మహిళలు, ఆశా వర్కర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం అందరూ సమూహంగా “జయ జయహే తెలంగాణ” గీతాన్ని ఆలపించారు.
News December 9, 2025
బాపట్లలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

బాపట్లలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని చీలు రోడ్డు వద్ద లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న శివరామకృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News December 9, 2025
మెటాకు షాక్.. 4 ఏళ్లలో $70 బిలియన్లు హాంఫట్

VR హెడ్ సెట్స్, స్మార్ట్ గ్లాసెస్‌తో గేమింగ్ కమ్యూనిటీకి చేరువకావాలనుకున్న మెటా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. నాలుగేళ్లలో 70 బిలియన్ డాలర్లు నష్టపోయింది. 2026 ఆర్థిక సంవత్సరంలో రియాల్టీ ల్యాబ్స్ బడ్జెట్లో 30% కోత విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా జనవరిలో లేఆఫ్స్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ వాల్యూ పెరిగే వరకు MR గ్లాసెస్ లాంచ్‌ను పోస్ట్‌పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది.


