News April 15, 2025

నారాయణపేట: సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఉన్న నోవాటెల్ హోటల్‌లో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పథకాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని ఎమ్మెల్యే అన్నారు.

Similar News

News October 25, 2025

రంప: ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు

image

విద్యార్థులు మానసిక, ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని రంపచోడవరం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య ఆశ్రమ ఉన్నత పాఠాశాలల హెచ్‌ఎంకు సూచించారు. శనివారం జడ్డంగి, తాళ్ళపాలెం (రాజవొమ్మంగి) గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను చూశారు. విద్యార్థినీ, విద్యార్థులుతో మాట్లాడారు. హెచ్‌ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులు ఉన్నారు

News October 25, 2025

ఎర్రిస్వామి గురించి అప్పుడే తెలిసింది: ఎస్పీ

image

AP: కర్నూలు బస్సు ప్రమాదంపై SP విక్రాంత్ పాటిల్ మరిన్ని విషయాలు వెల్లడించారు. ‘బైక్‌పై మరో వ్యక్తి ఉన్నాడని తెలిసి తుగ్గలి వెళ్లి ఆరా తీశాం. అప్పుడే ఎర్రిస్వామి గురించి తెలిసింది. అతడు HYD GHMCలో పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఎర్రిస్వామిని ఇంటి వద్ద దిగబెట్టేందుకు వెళ్తుండగా వర్షం వల్ల బైక్ స్కిడ్ అయింది. బస్సులో 250 స్మార్ట్‌ఫోన్ల రవాణాపై FSL నివేదిక తర్వాత స్పష్టత వస్తుంది’ అని వెల్లడించారు.

News October 25, 2025

జనగామ నుంచి పంచారామాలకు ఆర్టీసీ బస్సులు

image

జనగామ డిపో నుంచి కార్తీక మాసం టూర్ ప్యాకేజీలకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. ఈ అవకాశాన్ని యాత్రీకులు సద్వినియోగం చేసుకునాలని ఆమె కోరారు. కార్తీక మాసం ముగిసే వరకు ప్రతి ఆదివారం పంచారామాలకు జనగామ నుంచి ఆర్టీసీ బస్సులు బయలుదేరుతాయని వివరాలకు 9701662166, 7382852923 నంబర్లకు సంప్రదించాలని కోరారు.