News April 5, 2025
నారాయణపేట: సీతకు శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు

తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్గా నియమితులైన కే.సీత దయాకర్ రెడ్డిని నేడు నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కే.ప్రశాంత్ కుమార్ రెడ్డితో పాటుగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిశారు. సీతా దయాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 22, 2025
మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయండి: అదనపు కలెక్టర్

గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ అధికారిణి నిఖిలతో కలిసి శనివారం ఎంపీడీఓలు, ఎంపీవోలు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్స్లో విద్యుత్, తాగునీరు, వికలాంగులు, వృద్ధులకు ర్యాంప్ సౌకర్యం వసతులు పరిశీలన చేసి.. మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయాలన్నారు.
News November 22, 2025
HYD: నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి

నేడు సీఐడీ విచారణకు మంచులక్ష్మి హాజరుకానుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మిని సీఐడీ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను మంచులక్ష్మి ఎదుర్కొనగా.. మధ్యాహ్నం సీఐడీ సిట్ ఎదుట మంచు లక్ష్మి హాజరుకానున్నారు. కాగా, ఇప్పటికే రానా, విష్ణు ప్రియలను విచారించిన విషయం తెలిసిందే.
News November 22, 2025
కొమురవెల్లి మల్లన్న కొత్త రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో నిర్మిస్తోన్న కొత్త రైల్వే స్టేషన్ పనులు 96% పూర్తయ్యాయి. త్వరలో ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి వేలాది మంది భక్తులు రోజూ మల్లన్న దర్శనానికి రావడంతో ఈ స్టేషన్ నిర్మాణం వారి ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. కొత్త రైల్వే సౌకర్యంతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తగ్గి, ప్రాంతీయ రవాణా మరింత మెరుగవుతుంది.


