News April 8, 2025

నారాయణపేట: హత్య కేసులో నేరస్థుడికి జైలు శిక్ష

image

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని నారాయణపేట ఎస్పీ యోగేశ్‌గౌతమ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. వింజమూరు వాసి జోగువెంకట్ రాములు కొత్తపల్లి(M) తిమ్మారెడ్డిపల్లి వాసి కృష్ణవేణిపై అత్యాచారానికి యత్నించి నిప్పంటించి చంపేశాడు. ఈకేసులో ముద్దాయికి సోమవారం జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ శిక్ష విధించారు. 2022 FEB 15న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామన్నారు.

Similar News

News December 20, 2025

మహమ్మదాబాద్: గ్రూప్-3 జాబ్ సాధించిన మండల వాసి

image

మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన మిరియాల హనుమంతు కుమారుడు మిరియాల యాదగిరి గ్రూప్-3 ఉద్యోగం సాధించారు. ట్రెజరీ విభాగంలో సీనియర్ అకౌంటెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ మేరకు గండీడ్, మహమ్మదాబాద్ మండలాల నేతలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గర్వంగా ఉందని యాదగిరి “Way2News” ప్రతినిధితో తెలిపారు.

News December 20, 2025

పాలమూరు:21న సాఫ్ట్ బాల్ ఎంపికలు

image

మహబూబ్ నగర్ లోని స్టేడియం గ్రౌండ్లో ఈనెల 21న బాల, బాలికలకు సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్టును ఎంపిక చేస్తున్నట్లు సాఫ్ట్ బాల్ అధ్యక్షులు అమరేందర్ రాజు “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఎంపికైన వారు ఈనెల 24 నుంచి మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పూర్తి వివరాలకు 99590 16610, 99592 20075 లకు సంప్రదించాలన్నారు.

News December 19, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒MBNR:T-20 క్రికెట్ లీగ్.. షెడ్యూల్ విడుదల
✒సౌత్ జోన్.. 22న ‘ఫుట్ బాల్’ ఎంపికలు
✒MBNR: పాత బకాయిలు ఇస్తేనే సర్వే చేస్తాం: ఆశా వర్కర్లు
✒NGKL: వ్యవసాయ పొలాల్లో పెద్దపులి జాడలు
✒సౌత్ జోన్..రేపు షటిల్,బ్యాడ్మింటన్ ఎంపికలు
✒జాతీయస్థాయి ఖో-ఖో టోర్నికి పాలమూరు విద్యార్థిని
✒MBNR:ఈనెల 21న..U-19 కరాటే ఎంపికలు
✒ఓపెన్ SSC,INTER దరఖాస్తుకు గడువు పెంపు