News March 28, 2025
నారాయణపేట: ‘250 గజాల ప్లాట్‌కు రూ.45 లక్షల LRS’

ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం LRS విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో రూ.1,000 కట్టి LRSకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు బాబోయ్ ఇదేం LRS అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ పట్టణంలో 250 గజాల భూమికి రూ.45 లక్షలు LRS రావడంతో ప్లాటు అమ్మినా అంత డబ్బు రాదని, ప్రభుత్వం పేదల కడుపు కొట్టేందుకే LRSను ప్రవేశపెట్టిందని బాధితులు మండిపడుతున్నారు.
Similar News
News September 17, 2025
1948 SEP 17 తర్వాత HYDలో ఏం జరిగింది?

‘ఆపరేషన్ పోలో’ తర్వాత HYD సంస్థానాదీశుడు నిజాం భారత ప్రభుత్వానికి తలొగ్గారు. ‘గోల్కొండ ఖిలా కింద ఘోరి గడతాం’అని ఎవరిపై ప్రజలు తిరగబడ్డారో ఆయనను ప్రభుత్వం తెలంగాణకు రాజ్ ప్రముఖ్‌గా నియమించి గౌరవించింది. ఆ తర్వాత ఆయనకు ప్రత్యేక సెక్యూరిటీ కల్పించింది. రజాకార్లకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని పాకిస్థాన్‌కు పంపింది. 1952లో జనరల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. ప్రజలను పీడించిన ప్రభువుల కథ సుఖాంతం అయింది.
News September 17, 2025
AICTE ప్రగతి స్కాలర్షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<
News September 17, 2025
జగిత్యాల : హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

పొలాస-గుల్లపేట గ్రామాల సమీపంలో జరిగిన ఆటో డ్రైవర్ నహిముద్దీన్ హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు డిఎస్పీ రఘుచందర్ తెలిపారు. బీహార్ కు చెందిన దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్నిలు అద్దెకు ఆటో మాట్లాడుకుని వెళ్లారు. అద్దె విషయంలో గొడవ జరిగి గుడ్డతో ఉరివేసి తరువాత బండతో మోది హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.