News April 2, 2025
నారాయణపేట: ARMY జాబ్స్ కొట్టారు.. సన్మానం

నారాయణపేట జిల్లా కేంద్రంలోని అవంగాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్, రహిమాన్ పాషా ఆర్మీకి సెలెక్ట్ కావడంతో తోటి మిత్రులు, గ్రామస్థులు వారిని అభినందిస్తూ వారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని, యువకులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
వరంగల్: తపాలా శాఖ ఫిర్యాదుల స్వీకరణ

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజల నుంచి తపాలా శాఖకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు హనుమకొండ పోస్టల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. 52వ డాక్ అదాలత్ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఫిర్యాదులను పోస్టల్ కవర్లో కె. శ్రీకాంత్, అసిస్టెంట్ డైరెక్టర్(స్టాఫ్ & విజిలెన్స్) పోస్టుమాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ 500001కు డిసెంబర్ 1లోపు పంపించాలన్నారు.
News November 24, 2025
మధిర: లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు

లంచం తీసుకుంటూ మధిర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ALO) కె.చందర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. చనిపోయిన భవన కార్మికుడి పేరిట వచ్చే రూ.1.30 లక్షల ఇన్సూరెన్స్ బిల్లు పాస్ చేయడానికి అధికారి చందర్, మృతుడి భార్యను రూ.15,000 లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఖమ్మం రోడ్డులో వల పన్ని, లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
News November 24, 2025
మంగళగిరి చేనేతలకు గుడ్న్యూస్.. 12% మజూరీకి అంగీకారం

మంగళగిరి చేనేత కార్మికులు 2025-27 కాలానికి 12% మజూరీ రేటు ఇచ్చేందుకు అంగీకరించినట్లు మంగళగిరి చేనేత కార్మిక సంఘ సమన్వయ కమిటీ కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణ తెలిపారు. సోమవారం మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మజూరి పెంపుదలపై సమావేశం నిర్వహించారు. ఆమోదించిన మజూరి ప్రకారం మాస్టర్ వీవర్స్ అసోసియేషన్, మంగళగిరి వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నామని బాలకృష్ణ చెప్పారు.


