News April 11, 2025
నారాయణపేట: Way2Newsలో వార్త.. ఆ ఊరికి బ్రిడ్జి..!

నారాయణపేట జిల్లా మరికల్‌లో నాయీ బ్రాహ్మణ శ్మశాన వాటికకు నిత్యం వాగులో నుంచి నడుచుకుంటూ అంత్యక్రియలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఘటనపై బుధవారం Way2Newsలో <<16039649>>‘అంతిమయాత్రకు తప్పని తిప్పలు’<<>> అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి వెంటనే వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులు వంతెన నిర్మించేందుకు కొలతలను తీసుకెళ్లారు.
Similar News
News February 23, 2026
బాపట్ల: 82 కేంద్రాల్లో ‘పది’ పబ్లిక్ పరీక్షలు

జిల్లాలో మార్చి 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 15,944 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో బాలురు 7,977 మంది, బాలికలు 7,967 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 82 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
News February 23, 2026
ఇండియా బ్లాక్ చీఫ్ మమతా బెనర్జీ: మణిశంకర్ అయ్యర్

మణిశంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియా’ బ్లాక్ డ్రైవింగ్ సీటు నుంచి తప్పుకోవాలని రాహుల్ గాంధీకి సూచించారు. ప్రాంతీయ పార్టీల నేతలకు అవకాశం ఇవ్వాలని హితవు పలికారు. మమతా బెనర్జీని కూటమికి అసలైన నాయకురాలిగా పేర్కొన్నారు. ఆమె లేకపోతే కూటమి మనుగడే ఉండదని అభిప్రాయపడ్డారు. స్టాలిన్, అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ వంటి నేతలు కూటమిని నడిపించగలరని వ్యాఖ్యానించారు.
News February 23, 2026
కృష్ణా: డిగ్రీలతో ఉద్యోగాలు రావు- వెంకయ్య నాయుడు

ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ముచ్చటించారు. కేవలం డిగ్రీలతోనే ఉద్యోగాలు రావన్నారు. నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని తెలిపారు. యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకుని వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


