News October 18, 2024
నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ వేళల మార్పు
లింగంపల్లి నుంచి సికింద్రాబాద్, గుంటూరు మీదుగా తిరుపతి వెళ్లే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్(12734) రైలు వెళ్లే సమయం మారిందని మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ రైలు లింగంపల్లిలో 17.30 గంటలకు బయలుదేరి, సికింద్రాబాద్ 18.05, నడికుడి 20.34, పిడుగురాళ్ల 20.54, సత్తెనపల్లి 21.22, గుంటూరు 22.55, తిరుపతి 05.55 గంటలకు చేరుతుందన్నారు. నవంబర్ 1 నుంచి ముందస్తు రిజర్వేషన్ గడువును 120 నుంచి 60 రోజులకు తగ్గించారన్నారు.
Similar News
News November 5, 2024
నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఇదే!
ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11:30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం డ్రోన్ ఐటీ, సెమీకండక్టర్ పాలసీలపై అధికారులతో సమీక్ష చేస్తారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం పనులపై రివ్యూ చేసి, తరువాత రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్స్ తో సమావేశం అవుతారు
News November 5, 2024
తిరుమలలో జగన్ స్టిక్కర్‌తో అంబటి.. ఏం జరిగిందంటే..?
పల్నాడు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ స్టిక్కర్‌తో కూడిన షర్టులనే వాడుతుంటారు. ఆయన ఎక్కడకు వెళ్లినా అదే షర్టుతో ఉంటారు. ఈక్రమంలో అంబటి నిన్న తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆ సమయంలోనూ షర్టుపై జగన్ స్టిక్కర్ ఉందని అనకాపల్లి MP సీఎం రమేశ్ గుర్తించారు. తిరుమలలో రాజకీయ స్టిక్కర్లు, ప్లెక్సీలు నిషేధమని.. వెంటనే అంబటి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
News November 5, 2024
మాచవరం రానున్న డిప్యూటీ సీఎం పవన్
మాచవరం మండలం చెన్నాయపాలెంలోని సరస్వతి ఇండస్ట్రియల్ భూములను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించినట్లు తహశీల్దార్ క్షమారాణి మంగళవారం తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని సుమారు 1000 ఎకరాల వరకు రైతుల వద్ద నుంచి భూములు సేకరించి ఇప్పటివరకు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదన్నారు. దీంతో వవన్ పర్యటనపై జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.