News July 25, 2024

నారా రోహిత్‌కు మంత్రి లోకేశ్ బర్త్‌డే విషెస్

image

టాలీవుడ్ హీరో నారా రోహిత్‌కు మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్. మీలాగే ఈ రోజు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. జీవితంలో మీరు వృద్ధి సాధిస్తూనే ఉండాలి’ అని Xలో పోస్ట్ చేశారు. ఎన్నికల వేళ రోహిత్ పలు జిల్లాలో పర్యటించి టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

Similar News

News October 11, 2024

తాడేపల్లి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం షెడ్యూల్‌ను సీఎం కార్యాలయం విడుదల చేసింది. చంద్రబాబు 11.15 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా విద్యుత్ శాఖపై రివ్యూ చేస్తారు. అనంతరం మైనింగ్ శాఖపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారని కార్యాలయం తెలియజేసింది

News October 11, 2024

25 నుంచి అమెరికాలో మంత్రి లోకేశ్ పర్యటన

image

మంత్రి నారా లోకేశ్ ఈనెల 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. 29, 30 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే 9వ వార్షిక ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని ఆయా వర్గాలు తెలిపాయి. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు వారికి వివరిస్తారని చెప్పారు.

News October 11, 2024

BJP గుంటూరు జిల్లా అధ్యక్షుడి రాజీనామా ఆమోదం

image

BJP గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రతో పాటు మీడియా ప్యానలిస్ట్ పాలిబండ్ల రామకృష్ణ రాజీనామా చేశారు. మహిళలతో అసభ్యకరంగా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో కథనాలు రావడంతో బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయింది. దీంతో పార్టీ అధ్యక్ష పదవికి నరేంద్ర రాజీనామా చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన రాజీనామాను రాష్ట్ర పార్టీ శాఖ వెంటనే ఆమోదించింది. ఇక సుకన్యను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.