News June 7, 2024
నారా లోకేశ్‌తో సోమిరెడ్డి భేటీ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని నివాసంలో ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది. మంగళగిరి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించిన లోకేశ్‌కు సోమిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సర్వేపల్లిలో కాకాణిని ఓడించిన సోమిరెడ్డితో పాటు తండ్రి విజయంలో కీలకపాత్ర పోషించిన రాజగోపాల్ రెడ్డిని లోకేశ్ అభినందించారు.
Similar News
News December 10, 2024
గూడూరు: తల్లికి సాయం చేస్తానని లోకేశ్ హామీ
గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన మోహిందర్ తల్లి అనారోగ్యానికి గుర్యారు. నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవాలని మోహిందర్ సోషల్ మీడియాలో మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి నారా లోకేశ్ స్పందించారు. తన టీం చూసుకుంటుందని.. సాధ్యమైనంత వరకు సాయం చేస్తానని లోకేశ్ రిప్లే ఇఛ్చారు.
News December 10, 2024
తిరుపతిలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి: ఎంపీ
తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో మంగళవారం తిరుపతి ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ..ప్రసిద్ధ ఆధ్మాత్మిక క్షేత్రమైన తిరుపతి విశిష్టతలను వివరిస్తూ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
News December 10, 2024
ఆదూరుపల్లిలో అమానుషం
నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. చేజర్ల మండలం ఆదూరుపల్లి చర్చిలో ఎనిమిదేళ్ల గిరిజన బాలిక చనిపోయింది. అనారోగ్యానికి గురైన బాలికకు తానే ప్రార్థనలతో బాగుచేస్తానని పాస్టర్ చెప్పడంతో అక్కడే ఉన్నామని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుపైగా చర్చిలోనే ఉంచడంతో సోమవారం రాత్రి ఆరోగ్యం క్షీణించి మృతిచెందిందని వాపోయారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని స్వగ్రామం బాలాజీ రావు పేటకు తరలించారు.